వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖపట్నంలోని పాస్‌పోర్ట్ కార్యాలయాల్లో మంగళవారం సర్వర్లు పనిచేయకపోవడంతో సేవలకు అంతరాయం ఏర్పడింది. సాంకేతిక సమస్యతో దరఖాస్తుల పరిశీలన ప్రక్రియలు నిలిచిపోయాయి.
ముందస్తు సమాచారం లేకపోవడంతో స్లాట్ బుక్ చేసుకున్న దరఖాస్తుదారులు ఇబ్బందిపడ్డారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు గంటల తరబడి వేచి ఉండగా, సమస్య పరిష్కారంపై అధికారులు స్పష్టత ఇవ్వకపోవడంతో అయోమయానికి గురయ్యారు.
Comments
Loading comments...

