వార్తలకు తిరిగి వెళ్లండి
విద్యార్థులకు అండగా విశాఖ చారిటబుల్ ట్రస్ట్

మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం గూడెం జడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు. పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, విశాఖ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం ఈ ప్రశంసనీయ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సేవా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య పాల్గొని విద్యార్థులను అభినందించారు. ఈ చొరవపై స్థానికంగా హర్షం వ్యక్తమవుతోంది.
Comments
Loading comments...