వార్తలకు తిరిగి వెళ్లండి
స్కైరూట్ సంస్థకు సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు

దేశ తొలి ప్రైవేట్ రాకెట్ ‘విక్రమ్-1’ ప్రయోగం విజయవంతం కావడంపై తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. నగరానికి చెందిన అంతరిక్ష స్టార్టప్ కంపెనీ ‘స్కైరూట్ ఏరోస్పేస్’ సాధించిన ఈ అరుదైన మైలురాయిపై ఆయన ప్రత్యేక ప్రశంసలు కురిపించారు.
ఈ ఏడాది ఏప్రిల్‌లో ‘విక్రమ్-1’ రాకెట్ హార్డ్‌వేర్‌ను శ్రీహరికోట అంతరిక్ష కేంద్రానికి తరలించే కీలక ప్రక్రియను తానే స్వయంగా జెండా ఊపి ప్రారంభించిన సందర్భాన్ని సీఎం గుర్తుచేసుకున్నారు.
Comments
Loading comments...