వార్తలకు తిరిగి వెళ్లండి
పాతబస్తీలో ఫుడ్ సేఫ్టీ రైడ్స్

పాతబస్తీ చాంద్రాయణగుట్ట పరిధిలోని అల్-మదీనా, ఒమర్ చైనీస్ ఫాస్ట్ ఫుడ్ కేంద్రాలపై హెచ్-ఫాస్ట్, జీహెచ్‌ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా మెరుపు దాడులు నిర్వహించారు. అత్యంత అపరిశుభ్ర వాతావరణంలో ఆహార పదార్థాలను తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
ఈ తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచిన 80 కిలోల చికెన్, క్యాన్సర్ కారక కృత్రిమ రంగులు, పదేపదే వాడుతున్న కలుషిత నూనెను సీజ్ చేశారు.
Comments
Loading comments...