వార్తలకు తిరిగి వెళ్లండి

నాగల్‌గిద్ద మండలంలోని గంగారం తండా ప్రాథమిక పాఠశాలను జిల్లా సైన్స్ అధికారి సిద్ధారెడ్డి సందర్శించారు. ఉపాధ్యాయులు తులసిరావు, మానస స్వయంగా రూపొందించిన విద్యా పలుచట్లు, బోధన సామగ్రితో తరగతి గదులను ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన తీరును పరిశీలించి అభినందించారు.
ఇటువంటి వినూత్న బోధన విద్యార్థుల్లో అభ్యాసంపై ఆసక్తిని పెంచుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ హెచ్‌ఎం హిరామన్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

