Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక నిమజ్జన సమయంలో జాగ్రత్తలు పాటించాలి

Follow Udayam on Google
p.g.murthy Sep 20, 2026 12:06 PM మంచిర్యాలGeneral
వినాయక నిమజ్జన సమయంలో జాగ్రత్తలు పాటించాలి - Udayam
వినాయక విగ్రహాల నిమజ్జన సమయంలో నిర్వాహకులు, ప్రజలు జాగ్రత్తలు పాటించాలని జన్నారం ఎస్సై ఉదయ్ కిరణ్ సూచించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ మండలంలోని 29 గ్రామ పంచాయతీల పరిధిలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాల నిమజ్జనానికి ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. వినాయక విగ్రహాల నిమజ్జన సమయంలో డీజేల వినియోగానికి అనుమతి లేదన్నారు. చెట్లు, విద్యుత్ తీగల వద్ద ప్రమాదాలు జరగకుండా సిబ్బందికి సమాచారం ఇవ్వాలని ఎస్ఐ కోరారు.

Comments

G
Loading comments...