వార్తలకు తిరిగి వెళ్లండి

పార్వతీపురం జిల్లాలో వినాయక చవితి వేడుకల సందర్భంగా మండపాల ఏర్పాటుకు అవసరమైన అన్ని అనుమతులను సింగిల్ విండో విధానంలో పొందాలని ఎస్పీ మాధర్రెడ్డి తెలిపారు. నిర్వాహకులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
అనుమతి పత్రం, నిబంధనలతో కూడిన క్యూఆర్ కోడ్ను మండపంలో అందుబాటులో ఉంచాలన్నారు. ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా మండపాలు ఏర్పాటు చేయాలని, శబ్ద కాలుష్య నియంత్రణ నిబంధనలు పాటించాలని సూచించారు.
Comments
Loading comments...

