వార్తలకు తిరిగి వెళ్లండి

గానుగుపహాడ్ గ్రామ పంచాయతీ పరిధిలో బెల్ట్ షాపులు, అక్రమ మద్యం విక్రయాలను నిలిపివేయాలని గ్రామసభలో సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామస్థులు ఏకగ్రీవంగా నిర్ణయించారు. గ్రామాన్ని మద్య రహితంగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు.
ప్రజల ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, యువత భవిష్యత్తును కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గ్రామ అభివృద్ధికి ప్రజల ఐక్య నిర్ణయం బలమైన అడుగుగా పేర్కొన్నారు.
Comments
Loading comments...

