Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పిడుగుపాటుకు ఫోన్‌ పేలి విద్యుత్‌ ఉద్యోగి మృతి

Follow Udayam on Google
Anuroop Oct 05, 2026 7:07 PM అనంతపురంGeneral
పిడుగుపాటుకు ఫోన్‌ పేలి విద్యుత్‌ ఉద్యోగి మృతి - Udayam
అనంతపురం జిల్లాలో పిడుగుపాటుకు విద్యుత్ శాఖ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి చరణ్ మృతి చెందాడు. పుట్లూరు మండలం గాండ్లపాడు శివారులో విధులు ముగించుకుని ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా వర్షం మొదలైంది. చెట్టు కిందకు వెళ్లిన సమయంలో పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. పిడుగుపాటు ధాటికి జేబులోని మొబైల్ ఫోన్ పేలినట్లు స్థానికులు తెలిపారు. చరణ్ మృతితో గాండ్లపాడులో విషాదఛాయలు అలుముకున్నాయి.

Comments

G
Loading comments...