వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ ఏఆర్ కానిస్టేబుల్ మృతి ఘటనపై వైద్యుడు స్పందించారు. రాత్రి మద్యం సేవించిన అనంతరం వాంతులు అయ్యాయని బాధితుడు తెలిపాడని, దీంతో అసిడిటీ కారణంగా భావించి ఈసీజీ నిర్వహించినట్లు చెప్పారు.
ఈసీజీలో స్వల్ప మార్పులు కనిపించడంతో తదుపరి పరీక్షలు చేశామని తెలిపారు. చికిత్సలో భాగంగా ఇంజెక్షన్లు ఇచ్చిన తర్వాత ఆరోగ్యం బాగుందని చెప్పిన కొద్దిసేపటికే మళ్లీ కిందపడిపోయి మృతి చెందాడని వైద్యుడు వివరించారు.
Comments
Loading comments...

