Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ CITU ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికుల ధర్నా

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Sep 03, 2026 1:24 PM వికారాబాద్General
వికారాబాద్ మున్సిపల్ కార్మికులకు రెండు నెలలుగా పెండింగ్‌లో ఉన్న జీతాలను వెంటనే చెల్లించాలని సీఐటీయూ డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం బీజీఆర్ చౌరస్తాలో కార్మికులు పనులు బంద్ చేసి ధర్నా నిర్వహించారు. పెండింగ్ యూనిఫాంలు, సబ్బులు, నూనెలు, దుస్తులు అందించాలని, అదనపు కార్మికుల సంఖ్య పెంచాలని కోరారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు మహిపాల్ డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు.

Comments

G
Loading comments...