Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరంలో వైసీపీ ర్యాలీలకు అనుమతి నిరాకరణ

Follow Udayam on Google
నిహారిక రెడ్డి Aug 10, 2026 10:21 AM విజయనగరంGeneral
విజయనగరంలో వైసీపీ ర్యాలీలకు అనుమతి నిరాకరణ - Udayam
డీఎస్సీ అక్రమాలను నిరసిస్తూ సోమవారం ఉమ్మడి విజయనగరం జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో వైసీపీ తలపెట్టిన శాంతియుత ర్యాలీలకు పోలీసులు అనుమతి నిరాకరించారు. సెక్షన్‌ 30 అమల్లో ఉన్నందున ర్యాలీలకు అనుమతులు లేవని పోలీసులు స్పష్టం చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించరాదని హెచ్చరిస్తూ అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ నేతలకు ముందస్తు నోటీసులు జారీ చేశారు. దీంతో ఆయా ప్రాంతాల్లో ఉత్కంఠ నెలకొంది.

Comments

G
Loading comments...