Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం సబ్ జైలు తనిఖీ

Follow Udayam on Google
B RAJESH Aug 25, 2026 7:30 PM విజయనగరంGeneral
విజయనగరం సబ్ జైలు తనిఖీ - Udayam
జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి డా.ఏ.కృష్ణ ప్రసాద్ మంగళవారం విజయనగరం సబ్ జైలును తనిఖీ చేశారు. ఖైదీలకు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించి, పలు చట్టాలపై అవగాహన కల్పించారు. ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం అందించేందుకు ఏర్పాటు చేసిన జైలు లీగల్ ఎయిడ్ క్లినిక్ను పరిశీలించి, ఖైదీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జైలులోని వంటగది, భోజనశాల, స్టోర్ రూమ్లను పరిశీలించి పరిశుభ్రత పాటించాలని సూచించారు.

Comments

G
Loading comments...