వార్తలకు తిరిగి వెళ్లండి

పాలమూరు విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య జి.ఎన్. శ్రీనివాస్, రిజిస్ట్రార్ పి. రమేష్ బాబు వర్సిటీ బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త ఆశలు, ఆనందాలు, విజయాలు నింపాలని ఆకాంక్షించారు.
విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించాలని, సిబ్బంది అంకితభావంతో పనిచేస్తూ విశ్వవిద్యాలయ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని వారు పేర్కొన్నారు.
Comments
Loading comments...

