వార్తలకు తిరిగి వెళ్లండి

వీరఘట్టం అంబేడ్కర్ జంక్షన్ నుంచి బీఎంఆర్ థియేటర్ వరకు ఉన్న బీటీ రోడ్డు అత్యంత అధ్వానంగా మారింది. మంగళవారం సాయంత్రం కురిసిన వర్షంతో రోడ్డుపై రాళ్లు తేలి పాదచారులు నడిచేందుకు వీలు లేకుండా తయారైంది.
ఈ రహదారి అభివృద్ధికి గతంలో నాయకులు పలుమార్లు భూమి పూజ చేసి వదిలేశారు. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఇప్పటికైనా ఈ రహదారిని అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Loading comments...

