వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల మున్సిపాలిటీ విజయనగర్ కాలనీలో వీధి కుక్కల బెడద తీవ్రంగా మారింది. గుంపులుగా తిరుగుతున్న కుక్కలతో చిన్నారులు, వృద్ధులు, మహిళలు భయాందోళనకు గురవుతున్నారు. ఇంటి నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నామని, రాత్రివేళల్లో ఇబ్బందులు మరింత ఎక్కువగా ఉంటున్నాయని స్థానికులు తెలిపారు.
అధికారులు స్పందించి కుక్కల నియంత్రణకు తక్షణ చర్యలు చేపట్టి, ప్రజలకు భద్రత కల్పించాలని కోరారు.
Comments
Loading comments...

