Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ వైర్లకు తగిలిన బస్సు.. తప్పిన ప్రమాదం

Follow Udayam on Google
B Ganga Aug 31, 2026 11:43 AM పార్వతీపురం మన్యంGeneral
విద్యుత్ వైర్లకు తగిలిన బస్సు.. తప్పిన ప్రమాదం - Udayam
బలిజపేట (M) అరసాడ నాయుడు వీధిలో ప్రైవేటు బస్సుకు 33కేవీ విద్యుత్ లైన్ తగలడంతో మంటలు చెలరేగిన సంఘటన ఆదివారం జరిగింది. స్థానికుల వివరాలు మేరకు, గ్రామంలో వివాహ కార్యక్రమానికి వచ్చిన బస్సు రోడ్డుకు పక్కగా ఉంచుతున్న క్రమంలో విద్యుత్ వైర్లకు తాకడంతో ఈ ప్రమాదం జరిగిందన్నారు. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ సురేశ్ కిందకు దూకేసాడని, శరీరం కొంతమేర కాలడంతో పీహెచ్సీలో చికిత్స అందించి పార్వతీపురం తరలించారన్నారు.

Comments

G
Loading comments...