వార్తలకు తిరిగి వెళ్లండి

లోకేశ్వరం మండలంలోని హావర్గా గ్రామ శివారులో పంట పొలంలోని ట్రాన్స్‌ఫార్మర్ ఫ్యూజ్ రిపేర్ చేస్తుండగా విద్యుత్ సరఫరా పునరుద్ధరించడంతో కౌలు రైతు బరిడే పోతన్న (38)కు విద్యుత్ షాక్ తగిలింది.
ఈ ఘటనలో రెండు చేతులు, రెండు కాళ్లు, వీపుపై కాలిన గాయాలయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు నిర్మల్‌లోని దేవేందర్ రెడ్డి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Comments
Loading comments...

