వార్తలకు తిరిగి వెళ్లండి

పాత దామరాజుపల్లి గ్రామంలో విద్యుత్ పనులకు వెళ్లిన సిబ్బందిని సుమారు గంటన్నర పాటు నిర్బంధించి, బెదిరించినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. గ్రామ సర్పంచ్ భర్త రాజారెడ్డి దురుసుగా ప్రవర్తించి బెదిరించినట్లు సిబ్బంది మల్లాపూర్ ఎస్సై అనిల్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు.
గ్రామంలో బంగారం పోయిన ఘటనపై తమను ప్రశ్నించినట్లు తెలిపారు. తమకు రక్షణ , భద్రత లేకుండా గ్రామంలో విధులు నిర్వహించలేమని వినతిపత్రం సమర్పించారు.
Comments
Loading comments...

