Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బిర్యానీతో కూల్‌డ్రింక్స్ ప్రమాదం

Follow Udayam on Google
Shruthi Nov 17, 2026 8:26 PM నెల్లూరుGeneral
బిర్యానీతో కూల్‌డ్రింక్స్ ప్రమాదం - Udayam
బిర్యానీ తిన్న తర్వాత అరుగుదల కోసం చాలామంది కూల్‌డ్రింక్స్ తాగుతుంటారు. అయితే వీటిలోని కార్బన్ డయాక్సైడ్ పొట్టలోని జీర్ణరసాలను పలుచబరిచి గ్యాస్, కడుపు ఉబ్బరం, ఎసిడిటీ సమస్యలకు దారితీస్తుంది. సాఫ్ట్‌డ్రింక్స్‌లోని అధిక చక్కెర వల్ల క్యాలరీలు పెరిగి ఊబకాయం, ఫ్యాటీ లివర్ ముప్పు ఏర్పడుతుంది. బిర్యానీ తర్వాత జీలకర్రపొడి, పుదీనా వేసిన మజ్జిగ లేదా చక్కెర లేని నిమ్మరసం తాగడం ఆరోగ్యానికి మంచిది.

Comments

G
Loading comments...