Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ ప్రమాదంలో జూనియర్ లైన్మెన్ కు గాయాలు

Follow Udayam on Google
p.g.murthy Aug 23, 2026 3:36 PM మంచిర్యాలGeneral
విద్యుత్ ప్రమాదంలో జూనియర్ లైన్మెన్ కు గాయాలు - Udayam
దండేపల్లి మండలంలోని మోకాసిగూడ స్టేజి వద్ద విద్యుత్ షాక్ తగిలి జూనియర్ లైన్మెన్ మహేందర్ గాయపడ్డారు. ఆదివారం 33 కెవి విద్యుత్ స్తంభానికి ఉన్న చెట్ల కొమ్మలను తొలగించే క్రమంలో ఆయనకు విద్యుత్ షాక్ తగిలిందని స్థానికులు తెలిపారు. ఆయన విద్యుత్ స్తంభం పైనుంచి పడిపోగా స్థానికులు 108లో లక్షెట్టిపేట ఆసుపత్రికి తరలించారు. వైద్య చికిత్స అనంతరం జూనియర్ లైన్మెన్ కోలుకున్నారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

Comments

G
Loading comments...