Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ కోతలపై న్యూ వెల్మల్ గ్రామంలో రైతుల ఆందోళన

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 08, 2026 7:28 PM నిర్మల్General
విద్యుత్ కోతలపై సోన్ మండలం న్యూ వెల్మల్ లో రైతులు ఆందోళన చేపట్టారు. గ్రామంలోని 331 కెవి విద్యుత్ సబ్ స్టేషన్ ను వారు ముట్టడించారు. గ్రామ సమీపంలోనే విద్యుత్ సబ్ స్టేషన్ ఉన్న తమ గ్రామంలో విద్యుత్ సరఫరా సరిగా ఉండడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ కోతల కారణంగా చేతికి వచ్చిన పంటలు మట్టి పాలవుతున్నాయన్నారు. విద్యుత్ కోతలను వెంటనే నివారించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళనలు కొనసాగిస్తామన్నారు.

Comments

G
Loading comments...