Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులు చదువులో రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలి

Follow Udayam on Google
Saychi kumar Aug 26, 2026 7:50 PM కామరెడ్డిGeneral
విద్యార్థులు చదువులో రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలి - Udayam
విద్యార్థులు ఇష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఎల్లారెడ్డి సీఐ డి.రాజారెడ్డి సూచించారు. బుధవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ డా.ఈ. లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో నూతన విద్యార్థుల స్వాగత కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన సీఐ మాట్లాడుతూ గ్రామీణ విద్యార్థులు కళాశాలలో లభిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత విద్య, ఉద్యోగాల్లో రాణించాలని సూచించారు.

Comments

G
Loading comments...