వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని AISF జిల్లా కార్యదర్శి బి.రవికుమార్ డిమాండ్ చేశారు. పార్వతీపురంలో బుధవారం కరపత్రాలను విడుదల చేశారు. NTAను రద్దు చేసి, ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలని కోరారు.
ప్రభుత్వ విద్యా సంస్థలు, హాస్టళ్లను బలోపేతం చేసి మౌలిక వసతులు కల్పించాలన్నారు. ఆగస్టు 20న AISF ఆధ్వర్యంలో చేపట్టే రాష్ట్రవ్యాప్త నిరసనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

