వార్తలకు తిరిగి వెళ్లండి

మందస మండలం సొండిపూడి వంశీ హైస్కూల్‌లో జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. నేత్ర వైద్యాధికారి రోణంకి వెంకటరమణ 140 మంది విద్యార్థులను పరీక్షించగా, దృష్టిలోపం ఉన్న 16 మందికి కళ్లద్దాల కోసం సిఫార్సు చేశారు.
కంటి సంరక్షణ, వ్యాధుల నివారణపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. మొబైల్ ఫోన్ అధిక వినియోగంతో కళ్లకు కలిగే సమస్యలను వివరించారు.
Comments
Loading comments...

