Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థి మృతిపై మంత్రి అచ్చెన్నాయుడు ఆగ్రహం

Follow Udayam on Google
RAGHU Aug 18, 2026 9:27 AM శ్రీకాకుళంGeneral
విద్యార్థి మృతిపై మంత్రి అచ్చెన్నాయుడు ఆగ్రహం - Udayam
కోటబొమ్మాళి మండలం కురుడు బీసీ వసతి గృహంలో ఆరో తరగతి చదువుతున్న విద్యార్థి ముద్దాడ దుర్గాప్రసాద్ చెరువులో పడి మృతి చెందిన ఘటనపై రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి పూర్తి నివేదిక అందించాలని బీసీ సంక్షేమ శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

Comments

G
Loading comments...