Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థి మృతి ఘటనపై బాధ్యులపై చర్యలు తీసుకోవాలి

Follow Udayam on Google
Mohammad Aug 24, 2026 3:12 PM అనంతపురంGeneral
విద్యార్థి మృతి ఘటనపై బాధ్యులపై చర్యలు తీసుకోవాలి - Udayam
శెట్టూరు మండల కేంద్రంలోని ఎస్సీ వసతి గృహ విద్యార్థి మృతి ఘటనపై జై భీమ్ సంరక్షణ సమితి నాయకులు విలియమ్స్, ఆర్కే అలెక్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వసతి గృహం వార్డెన్, సిబ్బందిని తొలగించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సోమవారం ఆర్డీఓ వసంత్ బాబుకు వినతిపత్రం అందజేశారు. బాధిత కుటుంబానికి రూ. కోటి నష్ట పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, మంత్రి నారా లోకేష్ పరామర్శించాలని వారు డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...