వార్తలకు తిరిగి వెళ్లండి

సారంగాపూర్ మండల కేంద్రంలోని విద్యుత్ సబ్‌స్టేషన్ ఆపరేటర్ చంద్రశేఖర్‌పై పల్లెపు రాజు అనే వ్యక్తి కర్రతో దాడి చేసినట్లు సమాచారం.
ఈ ఘటనలో చంద్రశేఖర్‌కు గాయాలు కావడంతో 108 ద్వారా జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సబ్‌స్టేషన్ పరిసరాల్లో చెత్త వేయడం, బహిర్భూమికి వెళ్లడంపై మందలించిన విషయాన్ని మనసులో పెట్టుకుని దాడి చేసినట్లు సమాచారం. ఎస్సై గీత కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

