Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విదేశీ పర్యటనకు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్

Follow Udayam on Google
G. Sathish Sep 28, 2026 10:36 AM హైదరాబాద్General
విదేశీ పర్యటనకు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్  - Udayam
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ నేటి నుంచి అక్టోబర్ 8 వరకు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. అసెంబ్లీ, శాసన మండలి ప్రతినిధులతో కలిసి అధ్యయన పర్యటనలో భాగంగా జర్మనీ, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్ దేశాల్లో పర్యటించనున్నారు. ఆయా దేశాల్లోని పార్లమెంట్ హౌస్‌లను సందర్శించడంతో పాటు భారత రాయబార కార్యాలయాల సీనియర్ అధికారులతో సమావేశం కానున్నారు. పర్యటనలో భాగంగా ఇవాళ జర్మనీలోనికి చేరుకోనున్నారు.

Comments

G
Loading comments...