వార్తలకు తిరిగి వెళ్లండి

అల్వాల్ పట్టణంలో విచ్చలవిడిగా బోరుబావులు వేస్తుండటంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూగర్భ జలాలు అడుగంటిపోతున్న పరిస్థితుల్లో ఒకేసారి ఐదు, ఆరు బోరుబావులు వేస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందని ఆరోపించారు.
ఇప్పటికే తాగునీటి ఇబ్బందులతో అల్లాడుతున్నామని ప్రజలు వాపోయారు. అధికారులు స్పందించి బోర్ బావులు ఆపాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

