వార్తలకు తిరిగి వెళ్లండి

గొల్లపల్లి మండల కేంద్రానికి చెందిన బోనగిరి వెంకటేష్ మాతృమూర్తి అనారోగ్యంతో మృతి చెందడంతో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ సీనియర్ నేత కొప్పుల ఈశ్వర్ వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
మృతురాలి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపి, ధైర్యంగా ఉండాలని సూచించారు. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

