వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖపట్నం పోర్టు ఏరియాలోని శృంగమణి పర్వతంపై కొలువైన వేంకటేశ్వరస్వామి తెప్పోత్సవం ఆదివారం కనులపండువగా జరిగింది. దేవస్థానం నుంచి స్వామివారిని పల్లకీలో సముద్రతీరానికి తీసుకొచ్చి, ప్రత్యేకంగా అలంకరించిన పైలట్ లాంచీలో ఉంచి తెప్పోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రత్యేక పూజలు చేసి ఈ వేడుకను ప్రారంభించగా, ఆలయ ఈవో ఎస్.శ్రీనివాసరావు పర్యవేక్షణలో భక్తుల గోవింద నామస్మరణల మధ్య కార్యక్రమం వైభవంగా సాగింది.
Comments
Loading comments...

