వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాలో వచ్చిన భారీ వరదల్లో గల్లంతైన బాపట్ల జిల్లాకు చెందిన యువకుడు దొప్పలపూడి వెంకటేశ్ ఆచూకీ కోసం తగిన చర్యలు తీసుకోవాలని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు కోరారు. ఈ మేరకు కేంద్రమంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌తో పాటు ఏపీ మంత్రి నారా లోకేశ్‌కు ఆయన లేఖలు రాశారు.
పర్చూరు మండలం దేవరపల్లికి చెందిన వెంకటేశ్ ప్రస్తుతం ఒమాహా నగరంలో ఉంటుండగా.. ఇటీవల కాన్సాస్ రాష్ట్రం వెల్లింగ్టన్ సమీపంలో వరదల్లో కొట్టుకుపోయాడు. అమెరికా రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరిపి గాలింపు చర్యలు ముమ్మరం చేసేలా చొరవ చూపాలని ఎమ్మెల్యే తన లేఖలో విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

