వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కాపురం పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్‌కెనాల్ పనులను పరిశీలించారు. కరవు ప్రాంతమైన మార్కాపురానికి కృష్ణా జలాలు అందించడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా 1996లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేస్తామన్నారు.
ఈ సందర్భంగా ప్రాజెక్టు నిర్వాసితులు, రైతులకు పునరావాసం కింద రూ.300 కోట్లు కేటాయిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంత దశ మారుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

