వార్తలకు తిరిగి వెళ్లండి

వెల్దుర్తి మండలం అందుగులపల్లి గ్రామంలోని పెద్ద చెరువు గురువారం సాయంత్రం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు వచ్చిన వరద నీటితో రెండోసారి అలుగుపారింది. చెరువు నిండడంతో రైతుల్లో ఆనందం నెలకొంది.
చెరువు నీటితో వానాకాలం, యాసంగి పంటలకు సాగునీరు అందుతుందని రైతులు తెలిపారు. వర్షాలు కొనసాగితే చెరువులోకి మరింత నీరు చేరే అవకాశం ఉందని గ్రామస్థులు పేర్కొన్నారు.
Comments
Loading comments...

