వార్తలకు తిరిగి వెళ్లండి

సామర్లకోట మండలం వేట్లపాలెంలో జిల్లా ఎస్పీ బిందు మాధవ్ మంగళవారం పోలింగ్ కేంద్రాలను ఆకస్మికంగా పరిశీలించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద సీసీటీవీలు, తాగునీరు, బారికేడ్లు, విద్యుత్ సౌకర్యం కల్పించాలని సూచించారు. ఈ పరిశీలనలో సీఐ కృష్ణ భగవాన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

