వార్తలకు తిరిగి వెళ్లండి

అనుమతులు లేకుండానే జిల్లాలోని పలు మండలాల్లో వడ్డీ వ్యాపారాలు సాగుతున్నాయి. అప్పు తీసుకున్నవారి నుంచి అధిక వడ్డీలు వసూలు చేస్తూ, పత్రాలు, ఖాళీ చెక్కులతో బెదిరింపులకు పాల్పడుతున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి.
ఇచ్చోడలో ఓ ఉపాధ్యాయుడి నుంచి రూ.2 లక్షలు అప్పుగా ఇచ్చి, వడ్డీతో సహా చెల్లించినా మరో రూ.2 లక్షలు వసూలు చేసినట్లు కేసు నమోదైంది. గతేడాది 102, ఈ ఏడాది ఇప్పటివరకు 20 కేసులు నమోదయ్యాయి.
Comments
Loading comments...

