Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దిల్లీకి చేరిన వనపర్తి పంచాయితీ

Follow Udayam on Google
SHRUTHI Aug 23, 2026 8:33 AM మహబూబ్‌నగర్General
దిల్లీకి చేరిన వనపర్తి పంచాయితీ - Udayam
వనపర్తి కాంగ్రెస్‌లో చిన్నారెడ్డి, ఎమ్మెల్యే మేఘారెడ్డి మధ్య వివాదం దిల్లీకి చేరింది. పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ చిన్నారెడ్డిపై చర్యలు తీసుకోవాలని మేఘారెడ్డి కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఫిర్యాదు చేశారు. తన వ్యాఖ్యలపై జారీ చేసిన షోకాజ్‌ నోటీసును ఉపసంహరించాలని చిన్నారెడ్డి టీపీసీని కోరారు. ఇరువర్గాల వివరణలపై క్రమశిక్షణ కమిటీ పరిశీలన జరుపుతోంది.

Comments

G
Loading comments...