వార్తలకు తిరిగి వెళ్లండి

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ గురువారం నూజివీడు కోర్టుకు హాజరయ్యారు. ఎన్నికల సమయంలో నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీకి పాల్పడ్డారన్న ఆరోపణలపై గన్నవరం పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ కేసును విచారించిన రెండవ అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కే. శ్రావణి తదుపరి విచారణను వచ్చే నెల 16వ తేదీకి వాయిదా వేశారు. వంశీని చూసేందుకు ఆయన అభిమానులు భారీగా తరలివచ్చారు.
Comments
Loading comments...

