వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సేవలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి అన్నారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
వైఎస్సార్ ఎంతోమంది నాయకులకు స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, శేఖర్ గౌడ్, సాయిరెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

