Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాసవిమాత ఆలయంలో ఘనంగా శ్రావణ మాస పూజలు

Follow Udayam on Google
సందీప్ Aug 16, 2026 3:14 PM నిర్మల్General
వాసవిమాత ఆలయంలో ఘనంగా శ్రావణ మాస పూజలు - Udayam
సోన్ మండలం సాకెర గ్రామంలోని శ్రీ శివ పంచాయతన రమా సహిత సత్యనారాయణ స్వామి వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని ఆదివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ అధ్యక్షుడు ఆమెడ కిషన్ ఆధ్వర్యంలో అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించి, రంగురంగుల చీరలతో అమ్మవారిని అలంకరించారు. అనంతరం మహిళలచే సామూహిక శ్రీచక్ర కుంకుమార్చన, వాసవి మాత పారాయణం జరిపారు.

Comments

G
Loading comments...