వార్తలకు తిరిగి వెళ్లండి

వాంకిడి మండల కేంద్రంతో పాటు ఆదివాసీ గూడాలు, గిరిజన తండాల్లో శుక్రవారం బడుగ పండగను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. దోమలు, ఈగలు, క్రిమికీటకాలు, అంటువ్యాధులు దూరం కావాలని ప్రత్యేక పూజలు చేశారు.
శ్రావణమాసం నెలరోజులు మాంసాహారం ముట్టకుండా నియమాలు పాటించిన ప్రజలు బడుగ రోజు మాంసాహారం స్వీకరించారు. పిండివంటల నైవేద్యంతో గ్రామ పొలిమేరకు వెళ్లి సంప్రదాయ పూజలు చేశారు.
Comments
Loading comments...

