Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాలంటీర్లకు రైతులు సహకరించాలి

Follow Udayam on Google
p.g.murthy Sep 03, 2026 10:12 PM మంచిర్యాలGeneral
వాలంటీర్లకు రైతులు సహకరించాలి - Udayam
జన్నారం మండలంలోని దేవునిగూడెం క్లస్టర్ పరిధిలో డిజిటల్ క్రాప్ సర్వేను నిర్వహించేందుకు వచ్చే వాలంటీర్లకు రైతులు సహకరించాలని క్లస్టర్ ఏఈఓ అఖిల్ కోరారు. క్లస్టర్ పరిధిలోని కిష్టాపూర్, దేవునిగూడెం, కామన్ పల్లి, కిష్టాపూర్ గ్రామాలలో రైతులు వేసిన పంటలను డిజిటల్ పద్ధతిలో సర్వే చేసేందుకు వాలంటీర్లను నియమించామని తెలిపారు. సర్వే కోసం వచ్చినప్పుడు పొలాల్లో రైతులు అందుబాటులో ఉండి పూర్తిగా సహకరించాలన్నారు.

Comments

G
Loading comments...