Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాహనదారులచేత ప్రతిజ్ఞ చేయించిన సీఐ

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 01, 2026 7:29 PM విజయనగరంGeneral
వాహనదారులచేత ప్రతిజ్ఞ చేయించిన సీఐ - Udayam
విజయనగరం జిల్లా డెంకాడ మండలం నాతవలస టోల్‌ప్లాజా వద్ద మంగళవారం భోగాపురం రూరల్‌ CI శ్రీనివాస్‌, రోడ్డు భద్రతపై వాహనదారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సుమారు 100 మంది మోటార్‌సైకిల్‌, ఇతర వాహనదారులకు ప్రమాదాల నివారణ, హెల్మెట్‌ ప్రాముఖ్యతపై వివరించి నిబంధనలు పాటిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఎస్పీ పంపిన పాంప్లెట్లలోని సూచనలను చదివి వినిపించి వాటిని పంపిణీ చేశారు.

Comments

G
Loading comments...