వార్తలకు తిరిగి వెళ్లండి

పత్తికొండ పట్టణంలో ఎస్సై రామదాసు ఆధ్వర్యంలో పోలీసులు వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు. ద్విచక్ర వాహనదారుల డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్, ఆర్సీ, ఇన్సూరెన్స్ తదితర పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, హెల్మెట్ ధరించి ప్రయాణించాలని ఎస్సై రామదాసు సూచించారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
Comments
Loading comments...

