Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాగును పరిశీలించిన ఎస్సై, రాకపోకలు నిలిపివేత

Follow Udayam Digital on Google
p.g.murthy Jul 29, 2026 1:16 PM మంచిర్యాలతెలంగాణ
వాగును పరిశీలించిన ఎస్సై, రాకపోకలు నిలిపివేత - Udayam Digital
జన్నారం మండలంలోని రోటిగూడా గ్రామ శివారులో ఉన్న వాగును స్థానిక ఎస్సై ఉదయ్ కిరణ్ పరిశీలించారు. భారీ వర్షాలతో వాగు వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో బుధవారం మధ్యాహ్నం ఆయన వాగును పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వరద నీటితో వాగు ఉధృతంగా ఉందని, వాగును దాటే ప్రయత్నం ఎవరూ చేయవద్దని ఆయన సూచించారు. వాగు వద్ద పోలీసులను బందోబస్తుగా నియమించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...