Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉట్టిని పగలగొట్టేందుకు పోటీపడ్డ యువకులు

Follow Udayam on Google
p.g.murthy Sep 05, 2026 12:05 AM మంచిర్యాలGeneral
జన్నారం మండలంలోని పోన్కల్ గ్రామంలో ఉన్న శ్రీరామ నగర్ లో ఉట్టిని పగలగొట్టే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీ కృష్ణాష్టమి పురస్కరించుకొని శుక్రవారం రాత్రి రామాలయం మేదరి వాడలో ఉట్టిని పగలగొట్టే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చిన్నారులు, పెద్దలు ఉట్టిని పగలగొట్టేందుకు పోటీపడ్డారు. అనంతరం ఉట్టిని పగలగొట్టిన విజేతలకు నిర్వాహకులు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కాలనీ ప్రజలు ఉన్నారు.

Comments

G
Loading comments...