వార్తలకు తిరిగి వెళ్లండి

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా బంట్వారం మండల కేంద్రంలో కార్యక్రమం నిర్వహించారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి, జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. మండలంలోని వివిధ పాఠశాలలకు చెందిన ఉత్తమ ఉపాధ్యాయులకు ప్రశంసాపత్రాలు అందజేసి సన్మానించారు.
కార్యక్రమంలో ఎంపీడీవోలు, అధ్యాపకులు, స్థానిక ఉపాధ్యాయులు, మండల సర్పంచ్ మల్లేశం, ఎస్‌ఐ విమల పాల్గొన్నారు.
Comments
Loading comments...

