Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తమ ప్రధానోపాధ్యాయుడిగా నిజాంపట్నం హెచ్‌ఎం

Follow Udayam on Google
CH.JHAN JAYA KRISHNA Sep 02, 2026 6:59 PM బాపట్లGeneral
ఉత్తమ ప్రధానోపాధ్యాయుడిగా నిజాంపట్నం హెచ్‌ఎం - Udayam
బాపట్ల జిల్లా ఉత్తమ ప్రధానోపాధ్యాయుడిగా నిజాంపట్నం జెడ్పీహెచ్‌ఎస్ హెచ్‌ఎం పాలపర్తి శివన్నారాయణ అవార్డు అందుకున్నారు. ఆయన కృషితో పాఠశాలలో ఎస్‌ఎస్‌సీ ఫలితాలు 57 నుంచి 89 శాతానికి, విద్యార్థుల సంఖ్య 386కు పెరిగాయి. ఐఐఐటీ, ఎన్‌ఎంఎంఎస్‌ పరీక్షల్లోనూ విద్యార్థులు రాణించారు. ఈ అవార్డు ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రుల సమష్టి కృషికి దక్కిన గౌరవమని ఆయన తెలిపారు.

Comments

G
Loading comments...