Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రీన్‌కార్డు దరఖాస్తుదారులకు అమెరికా ఊరట

Follow Udayam on Google
Ravi Shukla May 31, 2026 9:01 AM జాతీయంGeneral
గ్రీన్‌కార్డు దరఖాస్తుదారులకు అమెరికా ఊరట - Udayam
అమెరికాలో శాశ్వత నివాస హక్కు కల్పించే గ్రీన్‌కార్డు దరఖాస్తుదారులు ప్రక్రియ ముగిసేవరకు స్వదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదని ఆ దేశం స్పష్టం చేసింది. దరఖాస్తు పరిశీలన సమయంలో వారు అమెరికాలోనే ఉంటూ వేచి ఉండవచ్చని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ తాజాగా వెల్లడించింది. అయితే, దరఖాస్తుదారు ఇక్కడే ఉండాలా లేదా స్వదేశానికి వెళ్లాలా అనే అంశంపై ఇమిగ్రేషన్ అధికారులదే అంతిమ నిర్ణయమని పేర్కొంది. ఇది పాత నిబంధనేనని, అధికారులకు ఉన్న విచక్షణాధికారాలను గుర్తుచేసేందుకే కొత్త మార్గదర్శకాలని వివరించింది.

Comments

G
Loading comments...